Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల రాజకీయ రసవత్తరంగా సాగుతోంది. నిన్నటివరకూ వైసీపీ నుంచి గంగుల ప్రతాపరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. దీంతో భూమా కుటుంబాన్ని గంగుల మాత్రమే ఎదుర్కోగలరని వైసీపీ శ్రేణులు కూడా ధీమాగా ఉన్నాయి. కానీ ఉన్నట్లుండి సీన్ రివర్సైంది. గంగుల పేరు తెరమరుగై.. నంద్యాల రాజగోపాల్ రెడ్డి సీన్ లోకి వచ్చారు.
నంద్యాల రాజగోపాల్ రెడ్డి అంత గట్టి అభ్యర్థి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బలమైన అనుచరగణంతో పాటు అంగ బలం, అర్థ బలం, అధికారం ఉన్న భూమా ఫ్యామిలీని ఈయనేం ఢీకొడతారని కార్యకర్తలు నిరాశ చెందుతున్నారు. ఇప్పటిదాకా తనకు టికెట్ ఇస్తానని చెప్పి.. చివరి నిమిషంలో హ్యాండిస్తే గంగుల సహకరిస్తారా అనేది కూడా పెద్ద ప్రశ్న.
వైసీపీలో గ్రూపుల సంగతి పక్కనపెడితే.. మంత్రి భూమా అఖిలప్రియ అట్నుంచి నరుక్కొస్తున్నారు. భూమా కుటుంబంతో వైఎస్ ఫ్యామిలీ అనుబంధం గుర్తుచేసి.. ఏకగ్రీవానికి సహకరించాలని కోరారట అఖిలప్రియ. విజయమ్మను సీక్రెట్ గా కలిసిన అఖిలప్రియ రాజకీయ ఎత్తులేశారు. కానీ విజయమ్మ హామీ ఇచ్చారా, ఆమె ఓకే అన్నా జగన్ వింటారా అనేది కీలకమైన అంశం.