Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన రాజమౌళి తర్వాత సినిమాకు మరింత సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం ఆరంభంలో జక్కన్న తర్వాత సినిమా ఉంటుందని సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం జక్కన్న కథపై వర్క్ చేస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. తాజాగా ‘శ్రీవల్లీ’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు. జక్కన్న ప్రతి సినిమాకు ఆయన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. అందుకే జక్కన్న తర్వాత సినిమాకు కూడా వియేంద్ర ప్రసాద్ కథ ఇవ్వబోతున్నాడు.
ఇటీవల విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… రాజమౌళి తర్వాత సినిమా గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, హీరో ఎవరు అనే విషయం కూడా నిర్ణయించుకోలేదని చెప్పుకొచ్చాడు. అయితే కొన్ని కథలు ఎంపిక చేసి పక్కకు పెట్టాం. వాటిలోంచి మంచి కథను రాజమౌళి పిక్ చేసుకుని సినిమాను స్టార్ట్ చేస్తాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రెడీగా ఉన్న కథల్లో ఒక పోలీస్ స్టోరీ రాజమౌళికి బాగా నచ్చిందని, ఆ కథతోనే రాజమౌళి తర్వాత సినిమా తీస్తాడని తాను భావిస్తున్నట్లుగా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు.