ఈ మల్టీస్టారర్‌ నిజం అయితే సంచలనమే

Rajamouli-Multi-Starrer-Mov

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

శనివారం సాయంత్రం నుండి టాలీవుడ్‌లో మరియు తెలుగు ప్రేక్షకుల్లో ఒకే చర్చ జరుగుతుంది. అదే జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా నందమూరి మల్టీస్టారర్‌. రాజమౌళి పోస్ట్‌ చేసిన ఒక ఫొటోతో మల్టీస్టారర్‌ వార్తలు ఊపందుకున్నాయి. రాజమౌళి తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌తో కథా చర్చలు జరిపాడని, ఆ సందర్బంగానే వారు కలిశారు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం భారీ ఎత్తున జరుగుతుంది. గత వారం రోజులుగా నంది అవార్డుల వివాదం జరుగుతుండగా, తాజాగా ఈ స్టిల్‌ను జక్కన్న విడుదల చేయడంతో మొత్తం ఫోకస్‌ దీనిపైకి మరలింది.

ram-charan-and-rajamouli

 

ఒక వేళ సోషల్‌ మీడియాలో, సినీ వర్గాల్లో జరుగుతున్నట్లుగా చరణ్‌, ఎన్టీఆర్‌ల కాంబో మల్టీస్టారర్‌ తెరకెక్కితే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడం కాస్త కష్టమే. సహజంగా వీరిద్దరిలో ఒక హీరో సినిమా వస్తేనే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. అదే వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయడం, దానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తే ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద నెలకొనే పరిస్థితులను ఊహించడం కష్టమే అంటున్నారు. వీరిద్దరి కాంబోలో జక్కన్న మల్టీస్టారర్‌ సినిమా వస్తే తెలుగు సినిమా చరిత్ర రికార్డులు బద్దలు కావడం ఖాయం. బాహుబలి మొదటి పార్ట్‌ కలెక్షన్స్‌ సునాయాసంగా బ్రేక్‌ అవుతాయి. టాప్‌ 2 చిత్రంగా నిలుస్తుందని అప్పుడే రికార్డులు కూడా అంచనా వేస్తున్నారు.

ntr-and-rajamouli

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో సినిమా పూజా కార్యక్రమాలు జరిపి, ఆగస్టులో షూటింగ్‌ కార్యక్రమాలు జరుపనున్నారు. 2019 చివర్లో లేదా 2020 ఆరంభంలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వార్తల్లో నిజం ఉందా లేదా అనేది జక్కన్న స్పందించాలి. మూడు రోజులుగా వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు రాజమౌళి స్పందించలేదు. అంటే మల్టీస్టారర్‌ వార్తలు నిజమే అయ్యి ఉంటాయని ఎక్కువ శాతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతి గొప్ప, అతి పెద్ద మల్టీస్టారర్‌ చిత్రాని చూసేందుకు తెలుగు ప్రేక్షకు రెడీ అవ్వాలని మీడియా వర్గాల వారు అంటున్నారు.