దయతో ఇచ్చిన అవార్డులపై వివాదమా..?

TDP Ministers angry on Nandi Awards Controversy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఏపీ ప్రభుత్వం తాజాగా తెలుగు సినిమాకు సంబంధించిన నంది అవార్డులను ప్రకటించిన విషయం తెల్సిందే. రాష్ట్రం విడిపోయిన తర్వాత నంది అవార్డులను ఏ రాష్ట్రం ఇవ్వాలా అనే చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం నంది అవార్డుల విషయమై పట్టించుకోక పోవడంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఒకే సారి అయిదు సంవత్సరాల నంది అవార్డులను ఒకే వేదికపై ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు 2012, 2013 సంవత్సరాలకు గాను అవార్డులను ప్రకటించారు. తాజాగా 2014, 2015, 2016 సంవత్సరాల అవార్డుల విజేతలను ప్రకటించారు. అయితే ఈ అవార్డుల విజేత జాబిత వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి, కమ్మ కులస్తులకు ఎక్కువ అవార్డులు ఇచ్చారు అనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

సినీ పరిశ్రమకు చెందిన పలువురు అవార్డులపై విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం, స్వార్థంతో ఈ అవార్డులను వాడుకుంది అంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన కొందరు మంత్రులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ వల్ల ఏపీకి ఎలాంటి లాభం లేదు. సినీ ప్రముఖుల ఇళ్లు అన్ని కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వారు ఏ ట్యాక్స్‌ కట్టినా కూడా తెలంగాణ ప్రభుత్వంకు వెళ్తుంది. ఏపీ ప్రభుత్వంకు సినిమా పరిశ్రమ ద్వారా వచ్చే పన్నులు చాలా తక్కువ. అయినా కూడా సినిమా కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో, దయతో ఏపీ ప్రభుత్వం అవార్డులను ఇచ్చేందుకు ముందుకు వస్తే ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమపై దయతో ఈ అవార్డులు ఇచ్చిందని అన్నాడు. ఇలాంటి విమర్శల వల్ల ఇకపై ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల జోలికి వెళ్లదని, ఇప్పటికే ప్రకటించిన నంది అవార్డులను కూడా వెనక్కు తీసుకుంటామని ఆ మంత్రి అంటున్నాడు. ఇప్పటికి అయినా సినీ ప్రముఖులు అవార్డుల విషయంలో సైలెంట్‌ అవుతారేమో చూడాలి.