Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 సినిమా ఈ ఏడాది ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. జాతీయ స్థాయిలో రికార్డులు తిరగరాసింది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పింది. అయితే ఏ దర్శకుడైనా… సొంత సినిమా ఎన్ని ఘనతలు సాధించినప్పటికీ ఆ మూవీని తన ఫేవరెట్ చిత్రంగా చెప్పరు. ఇతర దర్శకుల సినిమాల్లో ఏదో ఒకదాన్ని ఇష్టమైన మూవీగా ఎంచుకుంటారు. రాజమౌళి కూడా అలా ఈ ఏడాదిలో తనకిష్టమైన సినిమాను ఎంచుకున్నారు. ఆ మూవీ మరేదో కాదు… సందీప్ వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి.
తక్కువ బడ్జెట్ మూవీగా రిలీజయి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టుకుని తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయిన అర్జున్ రెడ్డి దర్శకధీరుడ్ని కూడా మెప్పించింది . ఈ సినిమా రిలీజయిన కొన్ని రోజులకే మూవీని చూసిన రాజమౌళి సందీప్ వంగా దర్శకత్వాన్ని హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ షాలిని పాండేల నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో తన ఫేవరెట్ మూవీ అర్జున్ రెడ్డి అని కితాబిచ్చారు. రాజమౌళేకాదు… ఎంతో మంది సినీ ప్రముఖులు అర్జున్ రెడ్డిపై పొగడ్తలవర్షం కురిపించారు. తెలుగులో అర్జున్ రెడ్డి రికార్డులు… ఇతర భాషలను సైతం ఆకర్షించాయి. తమిళ్, హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ లు తెరకెక్కనున్నాయి.