రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు టాస్క్ ఇచ్చిన రాజమౌళి

రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు టాస్క్ ఇచ్చిన రాజమౌళి

లాక్ డౌన్ సమయంలో సినీ ప్రముఖులు ఛాలెంజ్ లు విసురుతున్నారు. అయితే అర్జున్ రెడ్డి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు రాజమౌళి కి ఒక టాస్క్ ఛాలెంజ్ విసిరారు. అయితే దానికి స్పందించిన రాజమౌళి పూర్తి చేస్తా అని నిన్న వ్యాఖ్యానించారు. అయితే అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాజమౌళి తెలిపారు. టాక్స్ పూర్తి అయింది సందీప్ రెడ్డి గారు అని వ్యాఖ్యానించారు. అయితే ఇదే సమయంలో ఈ ఛాలెంజ్ ను రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లకు ఇచ్చారు రాజమౌళి. అంతేకాక బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ గారికి, దర్శకుడు సుకుమార్ గారికి, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి గారికి జక్కన్న ఛాలెంజ్ విసిరారు.

అయితే ఈ వీడియో పూర్తి చేసినందుకు గాను దర్శకుడు సందీప్, రాజమౌళి కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు టాస్క్ ఇవ్వడం తో జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు అభిమానులు సిద్దం అవ్వండి అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రౌద్రం రణం రుధిరం లో రామ్ చరణ్ కి సంబందించిన అల్లూరి సీతారామరాజు వీడియో విడుదల చేశారు. అయితే ఎన్టీఆర్ కొమరం భీమ్ కు సంబందించిన వీడియో ఇప్పటి వరకు విడుదల కాలేదు. అయితే ఈ వీడియో బయటికి రాకుండా నే ఇపుడు ఛాలెంజ్ విసరడం తో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నారు అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఎలాగో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున కొమరం భీమ్ కు సంబందించిన వీడియో ఎలాగో బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా మొదలైన ఛాలెంజ్ ఎక్కడి వరకు కొనసాగు తుందో చూడాలి.