Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దశాబ్దాలుగా ఇద్దరు మిత్రులుగా తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న రజనీ, కమల్ పాలిటిక్స్ లో మాత్రం విడిపోతున్నారు. ఇద్దరూ కలిసి పార్టీ పెట్టాలని శ్రేయోభిలాషులు సూచించినా.. ఇద్దరికీ చుక్కెదురవుతుందని భావించారు. అందుకే రజనీ తన సొంత పార్టీ ప్రయత్నాలు వేగవంతం చేస్తుంటే.. కమల్ మాత్రం డీఎంకే లైన్లో వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికే డీఎంకే కమల్ నుంచి మాట తీసుకుందని చెబుతున్నారు.
రజనీ, కమల్ ఇద్దరూ మంచి నటులే. ఎవరి స్టైల్ వారిది. ఎవరి యాక్షన్ వాళ్లది. మొదట్లో కమల్ సూపర్ స్టార్ గా చక్రం తిప్పగా.. ఇప్పుడు రజనీ ఎవరెస్ట్ అంత క్రేజ్ తో దూసుకుపోతున్నారు. కానీ ఇప్పుడు రజనీ క్రేజ్ కూడా తగ్గుతోంది. వరుస ఫ్లాపులు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే రోబో 2తో లాస్ట్ హిట్ కొట్టి పాలిటిక్స్ లోకి జంప్ చేయాలనే ఉద్దేశంతో సినిమా తీశారు రజనీ.
రోబో 2 హిట్టయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఊపులోనే సినిమా సక్సెస్ మీట్ లో పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత ఇవ్వాలని రజనీ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కామ్ గా బ్యాక్ గ్రౌండ్ రెడీ చేసిన రజనీ.. తన అభిమానులతో త్రిచిలో భారీ మీటింగ్ పెట్టించారు. ఆ జనబలమే అండగా పాలిటిక్స్ లోకి రావాలని సూపర్ స్టార్ భావన. కానీ రజనీ వస్తే సీఎం అయిపోతారని కొందరంటుంటే.. అంత సీన్ లేదని మరికొందరు తీసిపడేస్తున్నారు.
మరిన్ని వార్తలు: