Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రంను ఎట్టకేలకు రాజమౌళి ప్రకటించిన విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా నటించబోతున్న మల్టీస్టారర్‌కు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. మెగా, నందమూరి కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక రాజమౌళి సినిమా అంటే విన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడనే విషయం తెల్సిందే. ‘బాహుబలి’ చిత్రంలో రానా విలన్‌గా నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఇక జక్కన్న మల్టీస్టారర్‌లో విలన్ ఎవరై ఉంటారా అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు జక్కన్న తన సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
రాజశేఖర్‌కు గత కొంత కాలంగా విలన్‌గా ఎంట్రీ ఇవ్వాలనే ఆశ ఉంది. అయితే మంచి కథతో వస్తేనే విలన్ పాత్ర చేస్తాను అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. తాజాగా జక్కన్న విలన్ పాత్ర కోసం సంప్రదించగానే కనీసం కథ కూడా పూర్తిగా వినకుండా తన పాత్ర ఏంటో చెప్పమని ఓకే చెప్పేశాడట. తన మల్టీస్టారర్ చిత్రంలో విలన్‌గా ఒకే చెప్పిన కారణంగానే రాజశేఖర్ కూతురు శివాని సినిమా ప్రారంభోత్సవంకు రాజమౌళి వెళ్లి ఉంటాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్లకు సరి జోడీగా రాజశేఖర్ విలనిజంను పండిస్తాడనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.