జీవిత రాజశేఖర్ జోడీ తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత ప్రాచుర్యంను, గుర్తింపును దక్కించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజశేఖర్ ఇంకా కూడా హీరోగా సినిమాలు చేస్తుండగా, జీవిత మాత్రం అప్పుడప్పుడు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంది. సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్న జీవిత తన కూతుళ్లను మాత్రం హీరోయిన్స్‌గా చేయాలని నిర్ణయించుకుంది. మొన్నటి వరకు పెద్దమ్మాయి శివానీని మాత్రమే హీరోయిన్‌గా పరిచయం చేయాలనుకున్నారు. శివానీ హీరోయిన్‌గా ‘2 స్టేట్స్’ మూవీ ప్రారంభం అయ్యింది. అడవి శేషు హీరోగా తెరకెక్కుతున్న ఆ చిత్రం ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు శివాని తమిళంలో కూడా ఒక చిత్రం చేస్తుంది. ఈ సమయంలోనే చిన్నమ్మాయి శివాత్మికను కూడా హీరోయిన్‌గా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు.
శివాని కంటే శివాత్మిక అందంగా ఉంటుందని, జీవిత ఫీచర్స్ ఎక్కువగా చిన్నమ్మాయి శివాత్మికలోనే ఉంటాయి అని, అందుకే శివాత్మికు హీరోయిన్‌గా మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే జీవిత రాజశేఖర్ దంపతులు శివాత్మిను హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు సిద్దం అవుతున్నారు. శివాత్మిక కోసం ప్రస్తుతం మంచి కథను ఎంపిక చేసే పనిలో జీవిత ఉన్నారు. మరో వైపు మంచి హీరోతో శివాత్మికను పరిచయం చేయాలని రాజశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టార్ హీరోలతో పరిచయం అయిన హీరోయిన్స్‌కు మంచి లైఫ్ ఉంటుంది. అందుకే స్టార్స్‌తో శివాత్మికను పరిచయం చేయాలని రాజశేఖర్ దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. శివాత్మిక, శివానిల్లో ఎవరు స్టార్‌గా గుర్తింపు దక్కించుకుంటారో చూడాలి.