Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ సుదీర్ఘ కాలంగా హీరోగా కొనసాగుతూ వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ‘గరుడవేగ’ చిత్రంతో రాజశేఖర్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. అంతకు ముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సినిమాలు చేయాలనుకున్న రాజశేఖర్‌కు మంచి పాత్రలు దక్కలేదు. ఆ సమయంలోనే గరుడవేగ చిత్రం వచ్చి మంచి విజయాన్ని సాధించి పెట్టింది. దాంతో రాజశేఖర్ మరికొంత కాలం హీరోగా కొనసాగే అవకాశం ఉందని అంతా భావించారు. కాని తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాజశేఖర్ హీరోగా ఆఖరి సినిమా గరుడవేగ అని, ఇకపై ఆయన హీరోగా సినిమాలు చేయడని తేలిపోయింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసేందుకు రాజశేఖర్ ఆసక్తి చూపుతున్నాడు.
హీరోగా ఎన్నో సక్సెస్‌లను దక్కించుకున్న జగపతిబాబు ఈమద్య కాంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. అదే దారిలో రాజశేఖర్ కూడా నడవాలని భావిస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా రామ్ హీరోగా నటిస్తున్న ఒక చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రను పోషించేందుకు ఓకే చెప్పాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ చిత్రంలో రాజశేఖర్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సినిమా స్థాయి పెరిగింది. ఇకపై వరుసగా ఇలాంటి చిత్రాను, పాత్రలను చేస్తానని రాజశేఖర్ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు. హీరోగా సక్సెస్‌తో కెరీర్‌కు ఎండ్ పలకడం మంచి ఆలోచన అంటూ రాజశేఖర్ నిర్ణయాన్ని ఎక్కువ మంది అభినందిస్తున్నారు.