తెలుగు ‘కాలా’ ముంచేశాడు

Rajini kaala Movie Dull Collections In Tollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘కాలా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజినీకాంత్‌ గత చిత్రం కబాలి ఫ్లాప్‌ అయినా కూడా ఈ చిత్రాన్ని నమ్మి నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్‌లు భారీ ఎత్తున పెట్టారు. అయినా కూడా ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ‘కాలా’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అని చెప్పుకోవాలి. తెలుగులో ‘కాలా’ చిత్రం వసూళ్లు డిస్ట్రిబ్యూటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ అంచనాలున్న కారణంగా ఈ చిత్రాన్ని దాదాపు 30 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఇప్పుడు కనీసం 10 కోట్లు వచ్చే పరిస్థితి లేదు. సినిమా మొదటి వారం రోజుల్లో కేవలం 6 కోట్లను మాత్రమే వసూళ్లు చేసింది.

నైజాం ఏరియాలో కాస్త పర్వాలేదు అన్నట్లుగా 2.45 కోట్ల రూపాయలు వసూళ్లు అయ్యాయి. కాని ఆంధ్రా ఏరియాలో మాత్రం మరీ దారుణంగా కలెక్షన్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా సీడెడ్‌ ఏరియాలో కోటి కూడా వసూళ్లు రాలేదు. సీడెడ్‌ నుండి డిస్ట్రిబ్యూటర్‌ ఖచ్చితంగా 4 నుండి 5 కోట్ల వరకు ఆశించాడు. కాని పరిస్థితి చూస్తుంటే కోటిన్నర షేర్‌ వస్తే గ్రేట్‌ అన్నట్లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే తమిళనాడులో మాత్రం పూర్తి రివర్స్‌లో ఉంది. కేవలం నాలుగు రోజుల్లో ‘కాలా’ చిత్రం 100 కోట్లను వసూళ్లు చేసింది. రికార్డు స్థాయి వసూళ్లతో భారీగా దూసుకు పోతుంది. విజయ్‌ రికార్డులను రజినీకాంత్‌ సునాయాసంగా క్రాస్‌ చేయడం జరిగింది. భారీ రికార్డులు నమోదు చేసే దిశగా కాలా అడుగులు వేస్తున్నాడు. ‘కబాలి’ సినిమాతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో కాలా ఆకట్టుకోలేక పోయింది. కాని కబాలితో పోల్చితే కాలా చిత్రం తమిళనాడులో మంచి ఫలితాన్ని సాధించింది.