రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం

రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటికీ ఊగిసలాడుతున్నారు. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. రాజకీయాలపై మాత్రం.. అప్పుడప్పుడూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఎన్నికల కోసం.. తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించేసిన తరుణంలో.. రజనీకాంత్ మాత్రం… అప్పుడప్పుడూ.. రాజకీయాల్లోకి రావాలా వద్దా.. అని ఆలోచిస్తున్నట్లుగా.. ఓ ప్రకటన చేసి.. ఊరుకుంటున్నారు.

తాజాగా.. తాను పార్టీ పెట్టడానికి ఓ వేదికగా ఉంటుందని ఏర్పాటు చేసుకున్న రజనీ మక్కల్ మండ్రం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్‌ భేటీ అయ్యారు. వారికీ .. రజనీకాంత్ క్లారిటీ ఇవ్వలేదు. కొత్త పార్టీ ప్రకటించడంపై జిల్లా అధ్యక్షులతో చర్చ జరిగిందని.. జిల్లా అధ్యక్షులు సానుకూలంగా స్పందించారని రజనీకాంత్ ప్రకటించారు. అయితే.. రజనీకాంత్ ప్రకటనే సానుకూలంగా లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తనకు సానుకూలంగా లేవని ఆయన తేల్చేశారు. ఎందుకని అంటే.. రజనీకాంత్ ను కొంత మంది మోసం చేశారట.

రజనీ స్పందనతో మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శలు నివ్వెర్రపోయారు. కొద్ది రోజుల నుంచి ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. దాంతో ఆయన బీజేపీలో చేరాలని కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. సీఏఏ విషయంలోనూ కేంద్రానికి మద్దతుగా మాట్లాడారు. దీనిపై ప్రధానితో సమావేశమవుతానని చెప్పుకొచ్చారు. రజనీకాంత్ డొలయామనం రాజకీయాలకు పనికి రాదని.. ఇదే పద్దతిలో ఉండి.. ఆయన రాజకీయ పార్టీ పెట్టినా.. ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం..తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తోంది.