Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డీఎంకే పార్టీ పత్రిక మురసోలి ప్లాటినమ్ జూబ్లీ వేడుక.. భవిష్యత్ తమిళ రాజకీయాలకు వేదికగా నిలిచింది. కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ కంటే ముందే అన్నాడీఎంకే వ్యతిరేకతను బాగా జీర్ణించుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో తీవ్రస్థాయిలో ట్వీట్లు చేస్తున్న కమల్.. ఈసారి ఏకంగా డీఎంకేతో కలిసిపోయినట్లే కనిపించారు. తన మిత్రుడు రజనీని కనీసం పలకరించకుండా.. వేదిక మీద స్టాలిన్ పక్కనే కూర్చున్నారు కమల్.
ఇక రజనీ సంగతి సరేసరి. ముందుగానే బీజేపీతో అవగాహన ఉందని పుకార్లు వస్తున్న తరుణంలో.. ఆయన కనీసం స్టేజ్ ఎక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రజనీ లాంటి సూపర్ స్టార్ ను పిలిచి అవమానించారని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే వేదిక ఎక్కని రజనీ ఎందుకు ఫంక్షన్ కు వెళ్లారంటే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. డీఎంకేతో కమల్ కెమిస్ట్రీ చూడటానికే వెళ్లుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
భవిష్యత్తులో రాజకీయ రంగస్థలంపై ఈ ఇద్దరూ నటులు తలపడటం ఖాయమనేలా పరిణామాలు జరిగాయి. మరి తర్వాత ఎవరిది పైచేయి అవుతుందో తెలియాల్సి ఉంది. సినీ కెరీర్ తొలినాళ్లలో రజనీపై కమల్ ఆధిపత్యం చెలాయిస్తే.. ఆ తర్వాత రజనీ తిరుగులేని మాస్ ఇమేజ్ తో కమల్ ను వెనక్కినెట్టేశారు. మరి ఆ కసి ఇంకా లోకనాయకుడికి ఉందని, అందుకే ఇలా చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
మరిన్ని వార్తలు: