Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కాలా’ చిత్రం ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని వివాదాల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంకు రంజిత్ పా దర్శకత్వం వహిస్తున్నాడు. ధనుష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి. ముందుకు అనుకున్న ప్రచారం ఏప్రిల్‌లో రజినీకాంత్ ‘2.0’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కాని ఆ చిత్రం విజువల్ ఎఫెక్ట్ పూర్తి కాని కారణంగా విడుదల వాయిదా వేయడం జరిగింది. ఆ స్థానంలో ‘కాలా’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ‘కాలా’ చిత్రం టీజర్‌ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.
‘కబాలి’ చిత్రంతో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రంజిత్ పా ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు. రజినీకాంత్ కెరీర్లో ఇదే చివరి చిత్రం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మినహా ఇప్పటి వరకు సినిమా గురించిన సమాచారం ఏమీ లేదు. ఎట్టకేలకు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. మార్చి 10న ఈ చిత్రం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం టీజర్‌తో సినిమా స్థాయిని అమాంతం పెంచాలని భావిస్తున్నారు. గతంలో కబాలి చిత్రం టీజర్‌తో భారీ ఎత్తున పబ్లిసిటీ దక్కింది. తాజాగా కాలా చిత్రం టీజర్‌తో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించాలని రంజిత్ పా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.