సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఫ్యాన్స్ పట్ల చాలా ఆప్యాయతను కలిగి ఉంటాడు, ఫ్యాన్స్‌తో చాలా సన్నిహితంగా ఉంటూ వారే తన ప్రాణం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు. తాజాగా ఏడు సంవత్సరాల కుర్రాడు స్కూల్ ముందు పడి ఉన్న బ్యాగ్‌ను టీచర్‌కు అప్పగించి, ఆ బ్యాగ్ ఓనర్ వద్దకు చేర్చడం జరిగింది. ఆ బ్యాగ్‌లో 50 వేల రూపాయలు ఉన్నాయనే విషయం ఆ కుర్రాడికి తెలిసినా కూడా టీచర్‌కు ఇచ్చి, పోలీసులకు అప్పగించడంను అంతా కూడా అభినందిస్తున్నారు. ఆ బాలుడి పేరు మహ్మద్ యాసీన్, ఈ కుర్రాడు రజినీకాంత్ ఫ్యాన్. తాజాగా పోలీసులు యాసీన్‌కు సన్మానం చేసి, ప్రైజ్ మనీని అందజేయడం జరిగింది. ఆ సందర్బంగా యాసీన్ మాట్లాడుతూ తనకు రజినీ సార్ అంటే చాలా ఇష్టం అని, కలుసుకోవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
యాసీన్ విషయాన్ని తెలుసుకున్న రజినీకాంత్ తాజాగా సన్నిహితుల ద్వారా ఆ కుర్రాడిని రప్పించుకున్నాడు. ఆ కుర్రాడిని ఒడిలో కూర్చుబెట్టుకుని చాలా సమయం కబుర్లు చెప్పాడు. అదే సమయంలో ఇకపై యాసీన్ తనకు కొడుకు అంటూ ప్రకటించాడు. యాసీన్ చదువుకు మరియు ఇతరత్ర ఖర్చులన్నింటికి తాను ఆర్థిక సాయం చేస్తాను అని, యాసీన్ బాధ్యత తనది అంటూ అతడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చాడు. యాసీన్‌ను బాగా చదువుకోమని చెప్పడంతో పాటు, ఎప్పుడైనా చూడాలనిపిస్తే వచ్చేయమని చెప్పాడు. మొత్తానికి యాసీన్ చేసిన మంచి పనికి సూపర్ స్టార్ నుండి ప్రశంసలు దక్కడంతో పాటు, స్వయంగా ఆయనతో కొడుకు అనిపించుకోవడం జరిగింది. యాసీన్‌తో పాటు ఇక్కడ సూపర్ స్టార్ కూడా తన మంచితనంను చాటుకున్నాడు.