సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం జైలర్.ఇందులో తమన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఇటీవలే ఆగస్టు 10 న విడుదలైన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.సినిమా విడుదల అయినా కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూ.225 కోట్లతో రూపొందించిట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్ పై కూడా అంతేస్థాయిలో చర్చలు నడుస్తున్నాయి.రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్ , శివరాజే కుమార్ ,జాకీ ష్రాఫ్, తమన్నా లు ఎంత పారితోషికం అందుకున్నారు అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.కాగా భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.ఆ వివరాల్లోకి వెళితే. జైలర్ మూవీలో రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.సినిమా మొత్తం బడ్జెట్‌లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి.
ఇకపోతే మోహన్ లాల్ , శివరాజే కుమార్ కూడా పెద్దమొత్తంలోనే అందుకున్నట్లు తెలుస్తోంది.మోహన్‌లాల్ కు రూ.8 కోట్లు, శివరాజ్ కుమార్‌కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం.అలాగే బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ.కోటి రూపాయిలు చెల్లించినట్లు టాక్.ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు.కాగా ఈ సినిమా లో నటీనటుల రెమ్యూనరేషన్ తెలిస్తే చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు.