సూపర్ స్టార్ రజినీకాంత్, సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రోబో’ చిత్రం తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికి రోబో రికార్డులను ఏ ఇతర డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో బ్రేక్ చేయలేక పోయాయి. అంతటి ఘన విజయం సాధించిన రోబో కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. ఈ చిత్రం రోబోకు సీక్వెల్ అంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని తెలుగులో దాదాపు 75 కోట్లకు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఈ చిత్రం తెలుగులో 100 కోట్లు దక్కించుకుంటనే నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి వర్కౌట్ అయినట్లుగా లెక్క. డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబ్యూటర్లు వంద కోట్లు రాబడితేనే లాభాలను కల్ల చూస్తారని ప్రచారం జరుగుతుంది. తెలుగులో భారీ చిత్రాలే వంద కోట్లను రాబట్టలేక పోతున్నాయి. ఇలాంటి సమయంలో 2.ఓ చిత్రంపై వంద కోట్ల భారం పెట్టడం ఏమాత్రం మంచి నిర్ణయం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం 60 నుండి 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టే ఛాన్స్ ఉందని, అంతకు మించి బిజినెస్ చేస్తే నష్టాలు తప్పవన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.