రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2.ఓ ఈ చిత్రం నిన్న విడుదలై ప్రేక్షక ఆధరణ పొందుతుంది. శంకర్ ఈ సినిమాలోని పాత్రలను చక్కగా తిర్చీ దిద్దారు. రజినీకాంత్ డా. వశికరాన్ గా, రోబోట్ చిట్టిగా, ఇప్పుడు కొత్తగా వెర్షన్ 2.ఓ అనే రోబో పాత్రల్లో నటించారు. దర్శకుడి ఆలోచన ఇక్కడ చక్కగా పని చేసింది. ఈ చిత్రంలో మరో పాత్ర అక్షయ్ కుమార్ గారు పోషించిన పక్షి రాజు పాత్ర. నిజానికి ఈ పాత్ర నిజ జీవితంలో ఓ వ్యక్తి నుండి ప్రేరణ పొందింది. అతను మరెవరో కాదు సలీం అలీ. బర్డ్ మ్యాన్ అఫ్ ది ఇండియా గా పిలుస్తారు.
సలీం అలికి పక్షులంటే చాలా ఇష్టం. పక్షుల రక్షణ కొరకు అయన ఎంతగానో పాటుపడ్డారు. రాజస్తాన్ లోని భరత్ పురలో, దేశంలోనే తొలి పక్షుల అభయారణ్యం ని నెలకొల్పాడు. బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ ఏర్పాటులో ప్రధాన పాత్రా పోషించారు.సలీం అలీ పక్షులకు అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ తో సత్కరించింది. పక్షుల జీవన విధానాన్ని వివరించే ఎన్నో పుస్తకాలు రచించాడు అయన జూన్ 20 1987 లో తుది శ్వాస విడిచారు. అతని నుండి ప్రేరణ పొంది పక్షి రాజు అనే పాత్రను సృష్టించాం. ఈ సినిమాలో పక్షి రాజు పాత్రలో అక్షయ్ ఆకట్టుకున్నాడు నిజానికి ఇప్పుడు పర్యావరణానికి జరుగుతున్నా నష్టం గురుంచి ఈ చిత్రంలో బాగా చూపించారు. మొదట ఈ పాత్రను కమలహాసన్ అనుకున్నాం. కానీ కమలహాసన్ నో చెప్పేసరికి అక్షయ్ కుమార్ ని తీసుకున్నాం, అక్షయ్ ఈ పాత్రలో అద్బుతంగా నటించాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.