Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన ప్రకటనకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే రజినీకాంత్ రాజకీయాల గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆరు నెలల క్రితం రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ అంతా భావించారు. అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై కాస్త వెనుక ముందు ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కమల్ రాజకీయాల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో తాను రాజకీయాలపై పునరాలోచన చేయాలని రజినీకాంత్ భావించాడు. కమల్ రాజకీయాలతో సంబంధం లేకుండా తాను కూడా రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయానికి మళ్లీ రజినీకాంత్ వచ్చాడు.
దాదాపు పది సంవత్సరాలుగా రజినీకాంత్ ఫ్యాన్స్ ఆయన రాజకీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రిజినీకాంత్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులతో భేటీని నిర్వహిస్తున్నాడు. ఫ్యాన్స్‌తో భేటీ తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలే రజినీకాంత్‌కు అత్యంత సన్నిహితులు ఒకరు మాట్లాడుతూ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటూ ప్రకటించాడు.
అభిమానులతో భేటీ ముగిసిన తర్వాత డిసెంబర్ 31న ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని, తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా అభిమానులతో చెప్పి, ఆ తర్వాత మీడియా ద్వారా తానే స్వయంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే తమిళనాట రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. తమిళనాట రాజకీయాల్లో రజినీకాంత్ ఏ మేరకు ప్రభావం చూపుతాడు అనేది 2019 ఎన్నికల్లోనే తేలిపోయే అవకాశం ఉంది.