రజినీకాంత్ కూతురు సౌందర్య గత సంవత్సరం అశ్విన్ నుండి విడాకులు పొందిన విషయం తెల్సిందే. 2010లో వివాహం చేసుకున్న సౌందర్య రజినీకాంత్, అశ్వినీలు కలిసి ఉండటం కష్టం అవ్వడంతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాబు సౌందర్య వద్ద ఉన్నాడు. అశ్విన్ నుండి విడిపోయిన తర్వాత సౌందర్య సినిమాలతో బిజీ అయ్యింది.
మళ్లీ ఇప్పుడు ఆమె ప్రేమలో పడ్డట్లుగా తెలుస్తోంది. వ్యాపారవేత్త మరియు హీరో అయిన విషాగన్ ను వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. వీరి వివాహ నిశ్చితార్థం గత నెలలో జరిగినట్లుగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
వీరి వివాహాన్ని రహస్యంగా ఉంచాలని భావించారు. కాని తమిళ సినీ వర్గాల ద్వారా ఈ విషయం మీడియాకు లీక్ అవ్వడం జరిగింది. దాంతో ఇంతకు విషాగన్ ఎవరా అంటూ అంతా కూడా ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. విషాగన్ గతంలో రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. అయితే సినిమాల్లో లక్ కలిసి రాలేదు. దాంతో తన వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. తమిళనాడులో ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ అధినేత అయిన విషాగన్ తో సౌందర్య వివాహం అతి త్వరలోనే జరుగబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిశ్చితార్థంకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు అయ్యారట.