Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న విషయం తెల్సిందే. అయితే ఈ అమ్మడు కొన్ని సార్లు చేసే వ్యాఖ్యలు చాలా చిత్రంగా ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ హీరోయిన్స్‌తో పోల్చినట్లయితే సౌత్ హీరోయిన్స్‌కు పారితోషికం విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని, భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా హీరోయిన్స్‌కు ఆశించిన స్థాయిలో పారితోషికాలు అందడం లేదని, ముఖ్యంగా సౌత్‌లో స్టార్ హీరోయిన్స్ చాలా కష్టపడ్డా కూడా వారికి సరైన పారితోషికం అందడం లేదని రకుల్ వాపోయింది.
రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా మాట్లాడుతూ.. తమిళంలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలను వరుసగా చేస్తున్న నయనతారకు అందుతున్న పారితోషికం నామమాత్రమే అని, ఆమెకు పారితోషికం విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని రకుల్ చెప్పుకొచ్చింది. ఒక స్టార్ హీరోయిన్ పేరు చెప్పి సినిమాను అమ్ముకుంటున్న నిర్మాతలు ఆ హీరోయిన్‌కు మాత్రం అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. సౌత్ నిర్మాతలతో పాటు దర్శకు హీరోలు కూడా హీరోయిన్స్‌ను చిన్న చూపు చూస్తున్నారు అంటూ రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది.