మహేష్, ఎన్టీఆర్, చరణ్… ఇలా ఒకరిద్దరు మినహా ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరితోను నటించేసిన రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇంకా ఒక హీరోతో నటించాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ అండ్ హ్యాపెనింగ్ స్టార్ అయిన విజయ్ దేవరకొండతో నటించాలనేది రకుల్ కోరిక అట.
అర్జున్‌రెడ్డి చూసిన దగ్గర్నుంచీ అతనితో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తోందట. అతని నటన చాలా బాగా నచ్చిందని, అందుకే కలిసి నటించాలని వుందని రకుల్ చెప్పింది. విజయ్‌తో నటించే అవకాశం వస్తే ఇక రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పేస్తానని కూడా అంటోంది. మరి విజయ్ దేవరకొండ ఈ మాట విన్నాడో లేదో తెలీదింకా. హీరోయిన్ల పరంగా హాట్ అండ్ హ్యాపెనింగ్ వాళ్లతోనే చేయాలనే ఆంక్షలు అతనికి లేవు.
ఎవరితో అయినా నటించేయడానికి ఓకే అంటూ వుంటాడు. కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు లేవనేది విజయ్‌కి సమస్య కాకపోవచ్చు. ఎలాగో ఒక టైమ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన నటి కాబట్టి రకుల్ ప్రీత్‌ని తన తదుపరి చిత్రాల కోసం కన్సిడర్ చేయవచ్చు. అవకాశాలు తగ్గిన టైమ్‌లో సీనియర్ హీరోలతో నటించేయడం మాత్రం యువ హీరోల సరసన అవకాశాలకి రకుల్‌కి అవరోధంగా మారవచ్చు.