దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్న రకుల్ ప్రీత్

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్న రకుల్ ప్రీత్

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డంలో మ‌న క‌థానాయిక‌ల్ని మించిన‌వాళ్లు లేరు. ఫామ్ లో ఉండ‌గానే, సినిమాలు చ‌క చ‌క చేసేసి, ఆస్తులు కూడ‌బెట్టుకుని సెటిల్ అవ్వాల‌ని చూస్తుంటారు. ఈ విష‌యంలో రకుల్ ప్రీత్ సింగ్ అంద‌రికంటే ముందే ఉంటుంది. వ‌చ్చిన కొత్త‌లోనే హైద‌రాబాద్‌లో ఓ ఇల్లు కొనుక్కుంది. ఇప్పుడు బెంగ‌ళూరులో ఓ ఫ్లాటు కూడా త‌న సొంతం చేసుకుంద‌ని స‌మాచారం. బెంగ‌ళూరులోని అత్యంత ఖ‌రీదైన ప్ర‌దేశంలో రూ.6 కోట్ల‌తో ఓ ఫ్లాటు తీసుకుంద‌ట ర‌కుల్‌. అక్క‌డ ర‌కుల్‌కి కొంత‌మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొనే బెంగ‌ళూరులో ఫ్లాట్ కొన్న‌ద‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్‌లో ర‌కుల్ సొంతంగా ఓ జిమ్ నిర్వ‌హిస్తోంది. బెంగ‌ళూరులో కూడా అలానే బ్రాంచీలు తెర‌వాల‌ని చూస్తోంద‌ట‌. ఈమ‌ధ్య ర‌కుల్‌ప్రీత్ సింగ్ హ‌వా కాస్త త‌గ్గిన‌ట్టు అనిపించింది. అయితే బాలీవుడ్‌లో ఓ మంచి విజ‌యం అందుకోవ‌డంతో తిరిగి ఫామ్ లోకి వ‌చ్చిన‌ట్టైంది.