టాలీవుడ్‌లో కలకలంగా మారిన డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతుంది. తాజాగా, రకుల్ ప్రీత్‌సింగ్‌ను సెప్టెంబర్ 6న విచారణకు హజరుకావాలంటూ ఈడీ నోటీసులను జారీచేసింది. కాగా, రకుల్ హాజరుపై సందిగ్ధత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వలన తాను ఈడీ సూచించిన తేదిన హజరు కాలేనని రకుల్‌ప్రీత్ సింగ్ తెలిపారు. తనకు మరోరోజు కావాలని ఈడీని కోరారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు.
రకుల్ ప్రీత్‌సింగ్‌కు డ్రగ్స్ కేసుతో పలు లింకులున్నట్లు ఈడీ విచారణలో గుర్తించింది. కాగా, పూరిజగన్మాథ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డు చేసిన విషయం తెలిసిందే. కాగా, నటి చార్మీని ఈడీ ఐదు గంటలుగా విచారణ జరుపుతోంది. కెల్విన్ స్టేట్ మెంట్ ఆధారంగా చార్మీని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై కూడా విచారణ జరుపుతున్నారు. ప్రతి సమాధానాన్ని లిఖిత పూర్వకంగా ఈడీ నోట్ చేసుకుంటుంది. దీంతో ఈడీ కార్యలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు.