Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రంతో ఈ సంవత్సరం బిగ్గెస్ట్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. టాలీవుడ్ టాప్ 3 చిత్రాల జాబితాలో చోటు చేసుకున్న ‘రంగస్థలం’ చిత్రం తర్వాత చరణ్ చేయబోతున్న సినిమాకు రంగం సిద్దం అయ్యింది. ‘రంగస్థలం’ విడుదల కాకముందే దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్‌లో చరణ్ పాల్గొనబోతున్నాడు. రెండవ షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంకు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించాడనికి ముందే ఈ చిత్రానికి ‘రాజ వంశస్తుడు’ అనే టైటిల్‌ను ప్రకటించనున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో చరణ్ ఒక రాజ వంశస్తుడిగా కనిపించబోతున్నాడు. అందుకే రాజస్థాన్‌కు చెందిన రాజవంశస్తుల కోటలో ఈ చిత్రం షూటింగ్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. చరణ్ కెరీర్‌లో ఇదో విభిన్న చిత్రంగా ఉంటుందని దర్శకుడు బోయపాటి మొదటి నుండి చెబుతూ వస్తున్నాడు. అతి త్వరలోనే ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రకటన చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. గతంలో చిరంజీవి రాజవంశస్తుడిగా ఒకటి రెండు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు రామ్ చరణ్ తన తండ్రిని మరపించేలా ఈ చిత్రంలో నటిస్తాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.