ఫిల్మ్‌ నగర్‌ ఒక రెడ్‌ లైట్‌ ఏరియా అయ్యింది!

Sri Reddy Allegations on filmnagar over casting couch

Posted April 16, 2018 (6 days ago) at 12:10

ఇంత కాలం సైలెంట్‌గా ఉన్న వారు ఒక్కసారిగా గళం ఎత్తి కాస్టింగ్‌ కౌచ్‌పై ఆరోపణలు చేస్తున్నారు. స్టార్‌ హీరోల నుండి కోఆర్డినేటర్‌ల వరకు అంతా కూడా అమ్మాయిలను వాడుకోవాలని చూసే వాళ్లే అంటూ తాజాగా శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు పలువురు చిన్న హీరోయిన్స్‌, సహాయ నటిగా చేసిన వారు మీడియా ముందుకు వస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు మూలం అయిన ఫిల్మ్‌ నగర్‌ సాయంత్రం ఆరు దాటిన తర్వాత ముంబయి రెడ్‌ లైట్‌ ఏరియా కంటే దారుణంగా అవుతుందని, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కామ పిశాచాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

అమాయకమైన అమ్మాయిలు, ఛాన్స్‌ల కోసం చూసే అమ్మాయిలే టార్గెట్‌గా కొందరు కోఆర్డినేటర్స్‌ నీచంగా ప్రవర్తిస్తున్నారని, స్టార్స్‌ వద్ద వారిని పండబెట్టి వేలల్లో డబ్బులు తీసుకుని, వందల్లో అమ్మాయిలకు ఇస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఫిల్మ్‌ నగర్‌లో జరుగుతున్న బాగోతంలో పెద్దల హస్తం కూడా ఉందని చిన్న స్టార్స్‌ చెబుతున్నారు. రెడ్‌లైట్‌ ఏరియాగా ఫిల్మ్‌ నగర్‌ను మార్చేసిన ఆ కొందరిని కఠినంగా శిక్షించాలంటూ శ్రీరెడ్డిలాంటి వారు డిమాండ్‌ చేస్తున్నారు. అవసరాలకు వాడుకుంటూ, వారి అవసరాలను బలహీనతగా చేసుకుని అమాయకపు ఆడవారిని అన్యాయం చేస్తున్న కొందరు సినిమా పరిశ్రమకు మచ్చ తెస్తున్నారు. ఇకపై అయినా సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఉండవద్దని సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు.

SHARE