Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని దసరా లేదా దీపావళికి విడుదల చేయడం ఖాయం అని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారట. సంక్రాంతి కోసం ఇప్పటికే బాలకృష్ణ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. తన ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసి తీరుతాను అంటూ బాలకృష్ణ ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రకటించాడు. గత సంవత్సరం నుండి వరుసగా సంక్రాంతికి బాలయ్య సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం జై సింహాతో వచ్చిన బాలయ్య వచ్చే ఏడాది ఎన్టీఆర్ చిత్రంతో రాబోతున్నాడు. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ సినిమాతో చిరంజీవి సైరా సినిమాకు పోటీ వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.
అనూహ్యంగా సంక్రాంతి బరిలోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడం అందరికి షాకింగ్‌గా ఉంది. రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి వస్తే మరి చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల అయ్యేది ఎప్పుడు అంటూ చర్చ జరుగుతుంది. ముందుగా అనుకున్నట్లుగా కాకుండా ముందే సైరాను విడుదల చేస్తున్నారా అనే చర్చ జరుగుతుంది. ఒక వేళ దసరాకు మెగాస్టార్ చిరంజీవి సినిమాను విడుదల చేయబోతున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. భారీ ఎత్తున సినిమాను ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు సైరా కోసం సరైన సమయంను చూస్తున్నారు. ప్రస్తుతం రంగస్థలం సెట్టింగ్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. త్వరలోనే సైరావిడుదల తేదీపై క్లారిటీ వస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు మరియు మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక వేళ ఈ సంవత్సరం విడుదల కానట్లయితే వచ్చే సంవత్సరం వేసవి వరకు ఆగాల్సిందే.