Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకుకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు సినిమా లెజెండ్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని, పలు రికార్డు బ్రేకింగ్ చిత్రాలను చేసిన రామ్ చరణ్ సినీ ప్రయాణం మొదలై అప్పుడే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేటితో రామ్ చరణ్ ‘చిరుత’ సినిమా విడుదలై 10 సంవత్సరాలు అయ్యింది. అశ్వినీదత్‌పై ఉన్న నమ్మకంతో చిరంజీవి తన కొడుకు చరణ్‌ను పరిచయం చేసే బాధ్యతను చిరంజీవి ఆయనకు అప్పగించాడు. ఒక విభిన్నమైన పక్కా కమర్షియల్ సినిమాతో పూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. చాలా సైలెంట్‌గా ప్రారంభం అయిన ఈ సినిమా అంతే సైలెంట్‌గా పూర్తి అయ్యింది. సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా రివీల్ చేయకుండా జాగ్రత్తగా సినిమాను విడుదల చేశారు.
చిరు తనయుడు అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి. అలా అంచనాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. దాంతో చిరుత రికార్డు బ్రేకింగ్ కాకున్నా కూడా ప్రేక్షకులు ఆధరించారు. మొదటి సినిమాతో చిరు తనయుడు సక్సెస్ దక్కించుకున్నాడు. ఇక అప్పటి నుండి మొదలైన చిరుత జర్నీ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ పది సంవత్సరాల్లో పలు డిజాస్టర్‌లు కూడా చరణ్ చవిచూశాడు. ఆరంజ్, జంజీర్ వంటి సినిమాలతో పాఠాలు నేర్చుకుని, ‘బ్రూస్‌లీ’ వంటి చిత్రంతో గుణపాఠాలు నేర్చుకుని చరణ్ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు చరణ్ 10 సినిమాల్లో నటించాడు. పది సంవత్సరాల్లో పది సినిమాలు అంటే ఏ స్థాయిలో చరణ్ సినిమాల ఎంపిక ఉందో చెప్పుకోవచ్చు. లేట్ అయినా పర్వాలేదు కాని ఆశు, అంచనాలు పెట్టుకునే ఫ్యాన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో నిరాశపర్చవద్దు అనేది చరణ్ అభిప్రాయం. మొదటి చిత్రం ‘చిరుత’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చరణ్‌కు సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా చెప్పుకోవచ్చు.
‘మగధీర’ చిత్రంతో చరణ్ స్థాయి అమాంతం పెరిగింది. ఆ తర్వాత ‘ఆరంజ్’ డిజాస్టర్ అయినా కూడా చరణ్ కెరీర్‌పై ప్రభావం కనిపించలేదు. రచ్చ, నాయక్ చిత్రాతో మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాడు. బాలీవుడ్‌లో జంజీర్‌తో ప్రయోగం చేసి వద్దురా బాబు అనుకునేలా పాఠం నేర్చుకున్నాడు. ఎవడు, గోవిందుడు అందరి వాడేలా అనే విభిన్న చిత్రాలు చేసి మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. బ్రూస్‌లీ చిత్రం చేసి ప్రయోగాలు చేయవద్దని గుణపాఠం నేర్చుకున్నాడు. ‘ధృవ’ చిత్రంతో తన స్టామినా చూపించాడు. త్వరలో తన 11వ సినిమా ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చరణ్ కెరీర్‌లో ఇంకా ముందుకు వెళ్లాలని, సక్సెస్ అవ్వాలని మనమూ కోరుకుందాం.