Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్ రంగస్థలం చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్రను చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. మొదట రామ్ చరణ్ చెవిటి వాడిగా ఈ చిత్రంలో నటించబోతున్నాడు అనగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తమ అభిమాన హీరోను అలా చూడగలమా అని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని చిట్టిబాబు పాత్రను దర్శకుడు సుకుమార్ అద్బుతంగా మలిచి సినిమాను సూపర్ హిట్ చేశాడు.
ఏ హీరో అయినా తన ఇమేజ్‌కు తగ్గట్లుగా, తన అభిమానులను ఆకట్టుకునే విధంగా సినిమా ఉండాలని కథలను ఎంపిక చేసుకుంటాడు. కాని రామ్ చరణ్ మాత్రం తాను అలా కాదు అంటున్నాడు. తాను ఎప్పుడు కూడా ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు కమిట్ కాలేదు అని, దర్శకుడు మరియు మంచి కథ వస్తే అభిమానులు తప్పకుండా ఆధరిస్తారు అనే నమ్మకంతో సినిమాలు చేశాను తప్ప, ఇది చేస్తే అభిమానులు నచ్చుతారు, అది చేస్తే నచ్చరేమో అని తాను ఆలోచించను అంటూ చెప్పుకొచ్చాడు. అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను కమిట్ అయితే ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉందనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే చరణ్ మాటలపై ఫ్యాన్స్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అభిమానిస్తున్న మమ్ముల దృష్టిలో పెట్టుకోకుండా సినిమాలు ఒప్పుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.