వంద కోట్ల పారితోషికం

వంద కోట్ల పారితోషికం

ఒక్క సినిమా కోసం హీరోలు ఎంతగానో కష్టపడతారు. ఈ క్రమంలో కొన్ని చిత్రాలకు సంవత్సరాల తరబడి కాల్షీట్లు ఇచ్చేస్తుంటారు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేయడం మానేసి క్వాలిటీ మూవీ ఒక్కటి చేసినా చాలని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఒక్కో ఏడాది అసలు బాక్సాఫీస్‌ దగ్గర కనిపించకుండా పోతున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఇదే కోవలోకి చెందుతాడు. 2019లో వినయ విధేయ రామతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌, ఆచార్య సినిమాలతో బిజీగా మారాడు. ఇవి రెండూ కూడా వచ్చే ఏడాదే రిలీజ్‌ కానుండగా ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో 15వ సినిమా కూడా చేస్తున్నాడు.

అయితే చెర్రీ తన నెక్స్ట్‌ సినిమాకు వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించగా అవన్నీ అసత్యాలుగా కొట్టిపారేశాడు. అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? ఉన్నా నాకెవరు ఇస్తారు? అని తిరిగి ప్రశ్నిస్తూ అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చేశాడు. కాగా రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్‌ కానుంది.