Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ స్టార్స్ ప్రతి ఒక్కరు ఏదో ఒక బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అమితాబచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి వారు భారీ ఎత్తున అంబాసిడర్‌గా సంపాదిస్తున్నారు. ఇక తెలుగులో మహేష్‌బాబు ఆ మద్య సినిమాల కంటే ఎక్కువ యాడ్స్‌లో కనిపించేవాడు. సంవత్సరంకు 35 నుండి 45 కోట్ల వరకు సంపాదించేవాడు. ప్రస్తుతం మహేష్‌బాబు కాస్త యాడ్స్‌ను తగ్గించుకున్నాడు. ప్రభాస్ ఆమద్య మహీంద్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. కాని ఆ తర్వాత మరే బ్రాండ్‌కు సైన్ చేయలేదు. తాజాగా రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగాడు. గత కొంత కాలంగా ఈయన్ను ఎంతో మంది సంప్రదిస్తున్నారు. వారందరికి సున్నితంగా నో చెబుతూ వస్తున్న రామ్ చరణ్ ఎట్టకేలకు హప్పీ మొబైల్ స్టోర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఓకే చెప్పాడు.
అల్లు అర్జున్ ప్రస్తుతం లాట్ మొబైల్స్ స్టోర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో రామ్ చరణ్ హప్పి మొబైల్ స్టోర్ ప్రచారంకు సైన్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి థమ్సప్‌కు ప్రచారం చేయగా, పవన్ పెప్సీకి ప్రచారం చేసేవాడు. ఇప్పుడు అలాగే ఒకరు లాట్‌కు చేస్తుంటే మరొకరు హపీ మొబైల్ స్టోర్‌కు ప్రచారం చేస్తున్నారు. లాట్ మొబైల్స్ మరియు హప్పి మొబైల్ స్టోర్స్ మద్య ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు చెరో స్టోర్‌కు ప్రచారం చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది. ఈ రెండు స్టోర్స్‌లో దేని యొక్క సేల్స్ ఎక్కువగా ఉంటాయా అని అంతా చర్చించుకుంటున్నారు. మొత్తానికి సినిమాల విషయంలోనే కాకుండా ఇలా బ్రాండ్స్ విషయంలో కూడా ఈ కజిన్స్ పోటీ పడుతున్నారు.