మళ్లీ మగధీర సందడి…!

Ram Charan Magadheera Movie Again Release In Japan

రామ్‌ చరణ్‌ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌ చరిత్రలోనే నిలిచి పోయే చిత్రం ‘మగధీర’. దాదాపు 10 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం రికార్డులను అధిగమించేందుకు ఇతర చిత్రాలకు ఏడు ఏళ్లు పట్టింది. టాలీవుడ్‌ టాప్‌ చిత్రంగా మగధీర చిత్రం అన్ని సంవత్సరాలు ఉండటంతో పాటు, ఎన్నో అద్బుతమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికి కొన్ని రికార్డులు అలాగే ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మహాద్బుత చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ నటించింది. శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రంను జపాన్‌లో విడుదల చేయడం జరిగింది.

magadheera-ram-charan

దర్శకధీరుడు రాజమౌళి తాజాగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంకు జపాన్‌లో మంచి రెస్పాన్స్‌ దక్కింది. అందుకే ‘మగధీర’ చిత్రాన్ని అక్కడ విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. సినిమాపై నమ్మకంతో భారీ రేటుకు అక్కడ కొనుగోలు చేయడం జరిగింది. ఇక ‘మగధీర’ చిత్రం అక్కడ పది రోజుల్లోనే 17 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. లాంగ్‌ రన్‌లో 25 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జపాన్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమా ఉండటంతో భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. జపాన్‌ కలెక్షన్స్‌ను చూస్తుంటే ‘మగధీర’ చిత్రం ఇంకా పలు దేశాల్లో విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

ramcharan-magadheera