‘తమ్ముడు’గా మారబోతున్న చరణ్‌…!

Boyapati Hurt With Ram Charan Letter To This Fans

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంకు టైటిల్‌ ఏంటీ అనేది గత కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దసరాకు విడుదల చేయాలని చరణ్‌ భావిస్తున్నాడు. అందుకే బోయపాటి కూడా ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటి వరకు పలు టైటిల్స్‌ను పరిశీలించిన దర్శకుడు బోయపాటి తాజాగా తమ్ముడు అనే టైటిల్‌ ను సన్నిహితులతో చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ram-charan-boyapati

మొన్నటి వరకు ‘స్టేట్‌ రౌడీ’ అయితే బాగుంటుందని ఫ్యాన్స్‌ భావించారు. కాని ఆ టైటిల్‌కు కథకు సంబంధం లేదు కనుక దానికి నో అన్నాడు. తాజాగా ఈ చిత్రంలో అన్నదమ్ముళ్ల సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ చిత్రంకు ‘తమ్ముడు’ అనే టైటిల్‌ను పెట్టాలని నిర్ణయించుకున్నారట. పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ మూవీ అయిన తమ్ముడు టైటిల్‌తో వస్తే తప్పకుండా చరణ్‌కు కూడా మంచి జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ఈ చిత్రంకు ఆ టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని మెగా ఫ్యాన్స్‌ కూడా కోరుకుంటున్నారు. అయితే చిరంజీవి మరియు చరణ్‌లు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అనేది చూడాలి.

ram