సీక్వెల్‌పై చిట్టిబాబుకు ఆసక్తి లేదా?

Ram Charan not Interested acts in Rangasthalam Movie Sequel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్‌చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా ‘రంగస్థలం’ నిలవడం ఖాయం అని ఇప్పటికే తేలిపోయింది. కేవలం మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిన రంగస్థలం చిత్రం రామ్‌ చరణ్‌కు మంచి పేరును తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్‌ ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబు పాత్రకు ఆశించిన గుర్తింపు కంటే ఎక్కువ వచ్చింది అన్నాడు. అందుకే చిట్టిబాబును వదిలేయాలనిపించడం లేదు. చిట్టిబాబు పాత్రను కొనసాగిస్తూ సీక్వెల్‌ను చేయాలని కోరుకుంటున్నట్లుగా దర్శకుడు సుకుమార్‌ చెప్పుకొచ్చాడు. అయితే చిట్టిబాబుకు ఆపరేషన్‌ చేయించి, చెవులు వినిపించే చిట్టిబాబుగా సీక్వెల్‌లో చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

రంగస్థలం చిత్రం సీక్వెల్‌ విషయంపై సుకుమార్‌ ఆసక్తిగా ఉన్నాడు, కాని రామ్‌ చరణ్‌ మాత్రం ఆ స్థాయి ఆసక్తిని కనబర్చడం లేదని తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ను తాజాగా మీడియా మిత్రులు సీక్వెల్‌ గురించి ప్రశ్నించిన సమయంలో నవ్వి వదిలేశాడు. ఆసక్తి లేనట్లుగా, అన్ని అనుకున్నట్లుగా జరుగవు, జరుగుతున్న విధంగా మనం వెళ్లాలి అంటూ రామ్‌ చరణ్‌ మీడియాతో చెప్పుకొచ్చాడు. దాంతో రంగస్థలం చిత్రం సీక్వెల్‌పై రామ్‌ చరణ్‌కు ఆసక్తి లేదని తేలిపోయింది. చిట్టిబాబు తన కెరీర్‌లో మంచి పాత్ర, అలాంటి పాత్రను సీక్వెల్‌ చేసి ప్రయోగం విఫలం అయితే చిట్టిబాబు పాత్ర పరువు పోతుందని ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. సుకుమార్‌ మంచి కథతో వస్తే చరణ్‌ సీక్వెల్‌ గురించి తప్పకుండా పాజిటివ్‌గా నిర్ణయం తీసుకుంటాడని కొందరు అంటున్నారు.