కొరటాలది వదిలేయలేదంటున్న చరణ్‌

Ram Charan responds on Koratala Siva movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరో వైపు తన తండ్రి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘రంగస్థలం’ చిత్రం పూర్తి అయిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. ఇక ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో చరణ్‌ ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా కన్ఫర్మ్‌ అయ్యింది. ఇలా వరుసగా చిత్రాలు చేయబోతున్న చరణ్‌ ఆ మద్య ప్రకటించిన కొరటాల చిత్రాన్ని పక్కకు పెట్టినట్లే అని అంతా భావించారు. కాని తాజాగా కొరటాల చిత్రంపై చరణ్‌ క్లారిటీ ఇచ్చాడు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా కాస్త ఆలస్యంగా కొరటాలతో సినిమా చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా ‘భరత్‌ అను నేను’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. ఆ చిత్రం తర్వాత చరణ్‌తో మూవీకి కొరటాల ప్లాన్‌ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఆగస్టులో చిత్రాన్ని సెట్స్‌ పైకి తీసుకు వెళ్లి చివరి వరకు పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నాడు. చరణ్‌ తన తదుపరి చిత్రాన్ని వచ్చే నెలలో పూర్తి చేసి సమ్మర్‌ వరకు పూర్తి చేయనున్నాడు. అందుకోసం బోయపాటి పక్కా ప్లాన్‌ను సిద్దం చేశాడు. రాజమౌళి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి, షూటింగ్‌ ప్రారంభించే సమయానికి బోయపాటి మరియు కొరటాల శివల సినిమాలను పూర్తి చేయానే పట్టుదలతో చరణ్‌ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే 2018వ సంవత్సరంలో చరణ్‌ మూడు సినిమాలు రెడీ అవ్వబోతున్నాయి.