రంగస్థలం చిత్రం బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో `వినయ విధేయ రామ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలయ్యాక అసలు రామ్ చరణ్ ఈ కథ ఎలా ఒప్పుకున్నాడంటూ అని సందేహాలు కూడా వ్యక్తం చేశారు ప్రేక్షకులు. అంతటితో ఆగకుండా ఈ చిత్రంలో చరణ్ తో బోయపాటి చేయించిన విచిత్ర విన్యాసాలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ కామెంట్స్కూడా చేశారు.
మెగా అభిమానులు ఈ సినిమా మిగిల్చిన అవమానాలు అంత తేలిగ్గా మరచేలా లేరు. వినయ విధేయ రామ చిత్రం పరాజయం దగ్గర నుంచి రామ్ చరణ్ పెద్దగా బయటకు కూడా రాలేదు. అయితే ఈ రోజు ఈ సినిమా ఫ్లాప్ రామ్ చరణ్ స్పందించాడు. అన్ని సినిమాలలాగే వినయ విధేయ రామ చిత్రానికి కూడా నాతో పాటు డైరక్టర్, ఇతర సాంకేతిక నిపుణులు కష్టపడ్డారు. కానీ, ఫలితం మాత్రం దక్కలేదు. మీరు చూపించే ప్రేమను ప్రేరణగా తీసుకొని ఇక ముందు మంచి చిత్రాలతో మీ ముందుకు వస్తానంటూ అభిమానుకులకు ఓ లేఖను మీడియా ద్వారా పంపించాడు రామ్ చరణ్. ఈ లేఖ చదివిన ప్రతి ఒక్కరూ ఇలా నిజాయితీ గా తన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ లేఖ రాయడం గొప్ప విషయం. రియల్ హీరో అనిపించుకున్నాడు అని అంటున్నారు.