మెగా హీరో రామ్ చరణ్ ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు నిర్మాతగా వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న కారణంగా నిర్మాతలకు ఉండే ఇబ్బందులు ఏంటో తెలుసుకుని తాను హీరోగా చేస్తున్న సినిమాల నిర్మాణం విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు. ఇతర హీరోలు తమ సినిమాలు భారీగా ఉండాలి, ఖర్చు ఎక్కువ పెట్టాలని అంటూ ఉంటే, రామ్ చరణ్ మాత్రం తన సినిమాలకు ఎంత బడ్జెట్ అవసరమో అంతే పెట్టాలని, ఎక్కువ ఖర్చు చేయవద్దంటూ దర్శకులకు ముందే చెబుతున్నాడు. నిర్మాతలను కూడా ముందే రామ్ చరణ్ హెచ్చరిస్తున్నాడు.
రామ్ చరణ్ గత చిత్రం ‘రంగస్థలం’కు లిమిటెడ్ బడ్జెట్ ఖర్చు అయ్యింది. అందువల్ల నిర్మాతలు భారీ ఎత్తున లాభాలు దక్కించుకున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు వర్తింపజేస్తున్నాడు. కథానుసారంగా మాత్రమే బడ్జెట్ ఉండాలని, సినిమా భారీగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ ఖర్చు పెట్టవద్దంటూ ఇటీవలే బోయపాటికి సున్నితంగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అనవసర షాట్స్ మరియు వృదా ఖర్చులు తగ్గించాల్సిందే అంటూ తాజాగా రామ్ చరణ్ దర్శకుడు బోయపాటికి సూచించాడు అంటూ సమాచారం అందుతుంది. నిర్మాతల శ్రేయస్సు కోసం చరణ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చరణ్ ప్రస్తుతం తన తండ్రి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఆ చిత్రంకు కూడా నిర్మాణం పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎక్కడ వృదా ఖర్చు లేకుండా జాగ్రత్త పడాల్సిందిగా దర్శకుడు సురేందర్ రెడ్డికి పదే పదే చెబుతున్నాడు. అవసరం అయిన చోట మాత్రమే ఖర్చు చేయాలని సూచిస్తున్నాడు.