అబ్బే… అదేం లేదన్న చరణ్‌ టీం

Ram Charan Team Gives Clarity On Rangasthalam Reshoot
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. మార్చి 30 ఈ చిత్రాన్ని విడుదల చేబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యిందని, కాని కొన్ని సీన్స్‌పై సంతృప్తిగా లేని దర్శకుడు సుకుమార్‌ తాజాగా రీ షూట్‌కు ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. భారీ అంచనాలున్న ‘రంగస్థలం’ చిత్రంకు రీ షూట్‌ ఏంటా అని ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. రీ షూట్‌ అంటే చిత్ర యూనిట్‌ సభ్యులకే సినిమాపై నమ్మకం లేదేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సినిమా రీ షూట్‌ గురించి మీడియాలో వస్తున్న వార్తలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేశారు.

తాజాగా మెగా కుటుంబంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పీఆర్‌ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. రంగస్థలం చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యిందని, రీ షూట్‌కు సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, అంతా పక్కాగా దర్శకుడు సుకుమార్‌ చిత్రీకరించాడు. ఎక్కడ ఎలాంటి లోపం లేదని, రీ షూట్‌కు అస్సలు ఛాన్స్‌ రాలేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 150 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిన ఈ చిత్రం భారీగా వసూళ్లు సాధించడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో చరణ్‌ చెవిటి వాడిగా కనిపించబోతున్నాడు, సమంత పక్కా పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుంది. వీరిద్దరి కాంబో మొదటి సూపర్‌ హిట్‌ను అందుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.