చరణ్‌ కూడా దరఖాస్తు చేసుకున్నాడట…!

Ram Charan To Start Mega Film City In Vizag

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా మారి వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఈయన ఇప్పటికే నిర్మించిన ఖైదీ నెం.150 చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీ లాభాను ఆయనకు తెచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. నిర్మాతగా బిజీగా మారిన రామ్‌ చరణ్‌ త్వరలో స్టూడియో అధినేత కూడా అవ్వబోతున్నాడు అంటూ సినీ వర్గాల ద్వారా గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. తాజాగా ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు హైదరాబాద్‌లో రామ్‌ చరణ్‌ స్టూడియో నిర్మాణం జరుగనుందని అనుకున్నారు. కాని తాజాగా వైజాగ్‌లో చరణ్‌ స్టూడియో నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.

 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ది కోసం వైజాగ్‌లోని భీమిలి రోడ్డులో భారీ ఎత్తున భూమి కేటాయిస్తూ జీవోను జారీ చేయడం జరిగింది. ఆ భూమిని పలు నిర్మాణ సంస్థలకు తక్కువ రేటుకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బాలకృష్ణ అక్కడ స్టూడియో నిర్మాణంకు సిద్దం అయ్యాడు. ఏవీఎం స్టూడియో వారికి కూడా ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించబోతుంది. పలు నిర్మాణ సంస్థలు కూడా స్టూడియోల నిర్మాణంకు దరఖాస్తు చేయడం జరిగింది. అందరితో పాటు రామ్‌ చరణ్‌ కూడా స్టూడియో నిర్మాణంకు 25 ఎకరాల భూమికి కేటాయించాల్సిందిగా ధరఖాస్తు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఏపీ ప్రభుత్వంలో కొందరు చరణ్‌కు మద్దతుగా నిలుస్తూ భూమి కేటాయింపుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు మూడు ఏళ్లలో కొణిదెల వారి స్టూడియో ఏర్పాట్లు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

vizag-studio