ఈ నెల 12 న విడుదల అయిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం విజయం సాధించిన సందర్భంలో రామ్ గోపాల్ వర్మ మీడియా తో మాట్లాడారు. అయితే సినిమా విడుదల అవ్వాల్సిన తేదికి కాకుండా, రెండు వారాలు ఆలస్యంగా విడుదల అవ్వడం తో తాము ఎంతగానో నష్టపోయామని తెలిపారు. అయితే ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన సెటైరికల్ మూవీ అని చెప్పినప్పటికీ ఈ చిత్ర విడుదల అని ఆపారని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ చిత్ర విడుదల ఆగిపోవడానికి కారకులైన ఆ ఆరుగురి ఫై పరువు నష్టం దావా కనీసం 20 కోట్ల రూపాయలు అయినా వేస్తానని తెలిపారు.
అయితే మొదటినుండి తమ సినిమా ఫై టీవీ ఛానళ్లలో డిబేట్ పెట్టి దుష్ప్రచారం చేసిన ఇంద్రసేన చౌదరి తో పాటు, సినిమా విడుదల ఆలస్యం అవ్వడానికి కారకులైన కేఏ పాల్ పైన, సెన్సార్ ఆఫీసర్ జ్యోతితో సహా మరో ముగ్గురి ఫై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. మిగతా ముగ్గురు గురించి వివరాలు చెప్పలేదు, కానీ, ఆ ఆరుగురిని వదిలే ప్రసక్తి లేదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అయితే కొందరు లంచం తీసుకొని తమ సినిమాకి సెన్సార్ కాకుండా అడ్డుకున్నారని తెలిపారు. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆర్జీవీ తెలిపారు. అయితే కేఏ పాల్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ఫై దారుణ విమర్శలు చేసిన కేఏ పాల్, తనను అంటుంటే అవమానించారు అంటూ గుండెలు బాదుకుంటున్నారని, ఇంతకంటే పెద్ద జోక్ వుందా అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.