Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ తెలుగు మరియు హిందీలో అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించాడు. తెలుగులో ‘శివ’ చిత్రంతో ఇండియన్ సినిమా టెక్నికల్ వ్యాల్యూస్‌ను మార్చేశాడు. ఇక హిందీలో అమితాబచ్చన్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. హిందీలో వర్మ తెరకెక్కించిన సినిమాలు అద్బుతాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వర్మ గత పది సంవత్సరాల కాలంగా పెద్దగా ఆసక్తి లేకుండా సినిమాలు చేస్తూ, సినిమాపై కంటే ఆ సినిమాను వివాదాస్పదం చేసే విషయమై ఆలోచిస్తూ సినిమాలు చేస్తే వస్తున్నాడు. అందుకే వర్మ సినిమా అంటే ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. ఆయన మైండ్ దొబ్బింది అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో నాగార్జునతో వర్మ సినిమా మొదలు పెట్టడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. అసలు నాగార్జున ఈయన దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఎలా కమిట్ అయ్యాడు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు. అయితే నాగ్‌కు మాత్రం వర్మపై చాలా నమ్మకం ఉంది. తాజాగా సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా దర్శకుడు వర్మ మాట్లాడుతూ.. నాకు మైండ్ దొబ్బిందని చాలా మంది అంటున్నారు. నాకు సినిమాలు తీయడం చేతకాదని కొందరు తేల్చేస్తున్నారు. నాలో జ్యూస్ ఇంకా చాలా ఉందనే విషయం ఈ సినిమా నిరూపిస్తుందని వర్మ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా విడుదల తర్వాత తన గురించి వచ్చిన విమర్శలన్నింటికి సమాధానం దొరుకుతుందని వర్మ కౌంటర్ ఇచ్చాడు. వర్మ అన్నట్లుగా ఈ సినిమాతో ఆయన తన స్థాయిని మరోసారి రుజువు చేసుకుంటే ఆయన్ను ఇన్నాళ్లు విమర్శించిన వారు అంతా మళ్లీ పొగడ్తలతో ముంచెత్తుతారు.