Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ తప్పదంటూ కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈయన తెరకెక్కించిన పోర్న్ చిత్రం ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా వర్మ ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవి అనే మహిళ సంఘం నాయకురాలిపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడు. దేవి ‘జీఎస్టీ’ గురించి విమర్శనాత్మకంగా మాట్లాడిన సమయంలో వర్మ కాస్త అదుపు తప్పి జీఎస్టీ రెండవ పార్ట్ మీతో తీస్తాను అంటూ వ్యాఖ్యనించాడు. దాంతో ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తనపై అలాంటి వ్యాఖ్యలు చేసిన వర్మను కఠినంగా శిక్షించాలి అంటూ ఆమె సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా వర్మకు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో వర్మ సమయం కావాలని పోలీసులను కోరాడు.
వర్మ కోరినట్లుగా వారం రోజులు సమయం ఇచ్చిన సీసీఎస్ పోలీసులు ఈరోజు విచారణ చేస్తున్నారు. వర్మ విచారణలో సహకరించకుంటే అరెస్ట్ తప్పదని, ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అని, ఆయన ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశాడని సీసీఐ పోలీసులు గుర్తిస్తే వెంటనే అరెస్ట్ చేస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వర్మకు కేసులు, విచారణలు కొత్త కాదు. కాని ఈ సారి కాస్త సీరియస్ ఇష్యూ అవ్వడంతో ఆయన అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. నాగార్జునతో వర్మ ప్రస్తుతం ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ముంబయిలో ఆ చిత్రం షూటింగ్ జరుగుతుంది. షూటింగ్కు ఒక్క రోజు బ్రేక్ ఇచ్చి వర్మ విచారణకు హాజరు అయ్యాడు. ఒక వేళ వర్మ అరెస్ట్ అయితే నాగార్జున సినిమా ఆగిపోయే అవకాశం ఉంది.