Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగార్జునతో చేస్తున్న సినిమా పూర్తి కాకుండానే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త ప్రాజెక్ట్ ఏమిటో చెప్పేసాడు. నాగ్ తో సినిమా అయ్యాక “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ తీస్తాడని ఇటు వైసీపీ శ్రేణులు , అటు లక్ష్మీపార్వతి అనుకుంటుంటే వర్మ మాత్రం కడప బాంబ్ పేల్చాడు. “ కడప – రాయలసీమ రెడ్ల చరిత్ర “ పేరుతో అంతర్జాతీయ స్థాయి తెలుగు వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు వర్మ ప్రకటించాడు.
హింసోన్మాదం, రక్తపాతం, ఆధిపత్యం, ఆశ, వెన్నుపోటు వంటి రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులకి కేరాఫ్ అడ్రస్ అయిన ఓ ప్రాంతం గురించి తాను అనుకున్నది అనుకున్నట్టు తీయడానికే వెబ్ సిరీస్ తో ముందుకు వస్తున్నట్టు వర్మ చెప్పాడు. ఇంతకుముందు రక్తచరిత్ర సినిమా తీసినప్పటికీ కొన్ని కొన్ని ఇబ్బందులు , ఇతరత్రా కారణాలతో అనుకున్నది అనుకున్నట్టు చేయలేకయానని వర్మ ఫీల్ అవుతున్నారు. అందుకే ఈసారి వెబ్ సిరీస్ విషయంలో ఆ మొహమాటాలు , భయాలు వదిలేసి తీయడానికి రెడీ అంటున్నాడు వర్మ.
“ లక్ష్మీస్ ఎన్టీఆర్ “ తీసి చంద్రబాబు ఇమేజ్ డామేజ్ చేస్తాడని నిర్మాత రాకేష్ రెడ్డి సహా వైసీపీ వాళ్ళు వర్మ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ “కడప – రాయలసీమ రెడ్ల చరిత్ర “ అనగానే వారికి కంగారు పుడుతోంది. పైగా వెబ్ సిరీస్ అనగానే సెన్సార్ కి కూడా అవకాశం ఉండదాయే. ఈ క్రమంలో టైటిల్ ని బట్టి చూస్తే వై,ఎస్ గురించి వర్మ తప్పకుండా చూపిస్తారు. ఆయన ఎన్టీఆర్ గురించి అయినా వై.ఎస్ గురించి అయినా పాజిటివ్ గా చూపించడానికి అయితే సినిమానే తీయరు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ ని వదిలేసి వై.ఎస్ ని వర్మ టార్గెట్ చేస్తాడా అన్న సందేహాలు వస్తున్నాయి. అయినా వర్మ చేతిలో సినిమా ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎలా చెప్పగలం ?