ఆ సినిమా ముందు పోకిరి ఫ్లాప్‌.. వర్మ కామెంట్స్‌

ram gopal varma praises on puri jagannath for akhash mehibooba movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేస్తూనే ఉంటాడు. గత కొన్ని రోజులుగా ఆయన ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ పేరుతో ఒక షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించి వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. అంతకు ముందు కడప చిత్రంతో వివాదాలను నెత్తికి ఎత్తుకున్నాడు. ఇక తన సన్నిహితుల సినిమాలను కొన్ని సార్లు ఆకాశానికి ఎత్తేయడం వర్మకు అలవాటు. వర్మను అత్యధికంగా అభిమానించే పూరి జగన్నాథ్‌ ప్రస్తుతం ఆయన కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా ‘మెహబూబా’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను దర్శకుడు వర్మకు పూరి చూపించడం జరిగింది. ఆ సీన్స్‌పై వర్మ సంచలన రీతిలో ట్వీట్‌ చేశాడు.

వర్మ ట్విట్టర్‌లో స్పందిస్తూ… పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెహబూబా’ చిత్రంలోని కొన్ని సీన్స్‌ను ఇప్పుడే చూడటం జరిగింది. మహేష్‌బాబు ‘పోకిరి’ సినిమా ఈ సీన్స్‌ ముందు దిగదుడుపు అంటూ చెప్పేశాడు. వర్మ చేసే ప్రతి కామెంట్‌ కూడా ఇదే స్థాయిలో ఉంటుంది. పలు సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. కాని ఆ సినిమాలు ఎక్కువ శాతం సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు.

ఈ చిత్రంతో ఆకాష్‌ స్టార్‌ హీరో అవ్వడం ఖాయం అంటూ వర్మ పేర్కొన్నాడు. వర్మ ట్వీట్‌కు పూరి స్పందిస్తూ జీవితంలో తాను పొందిన అతి పెద్ద కాంప్లిమెంట్‌ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తొలిసారి నేను చేసిన సినిమాను గురూజీ మెచ్చుకున్నారంటూ పూరి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వర్మ చేసిన వ్యాఖ్యలు మరీ అతిగా ఉన్నాయని, పూరికి వర్మ గురువు కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వర్మ చేస్తున్న ‘మెహబూబా’ ప్రచారం ఏ మేరకు ఆ సినిమాకు ఉపయోగపడుతుందో చూడాలి.

varma about puri jagannath