Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో ఉన్నాడు. త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు. ఎన్టీఆర్‌గా మరియు లక్ష్మీ పార్వతిగా ఎవరు నటిస్తారు అంటూ తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే రామ్‌గోపాల్ వర్మ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమయంలోనే తెలుగు దేశం పార్టీ నాయకులు వర్మను టార్గెట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను కేవలం వివాదాలను పెంచడానికి తీస్తున్నాడని, ఎన్టీఆర్ గురించి ఏం తెలుసని వర్మ ఈ సినిమాను తీస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.
ప్రతి టీడీపీ లీడర్ విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్న వర్మ వారికి చుక్కలు చూపిస్తున్నాడు. టీడీపీ వారికి చాలా క్లారిటీగా సమాధానాలు చెబుతున్న వర్మ ఎన్టీఆర్ జీవితంలో ఎందుకు ఆ ఘటాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారు అంటూ ప్రశ్న ఎదుర్కొంటున్నాడు. ఎన్టీఆర్ జీవితం అనేది మహాభారతం వంటిది. ఆయన జీవితం మొత్తం రెండు గంటల్లో తెరకెక్కించడం దాదాపు అసాధ్యం. అందుకే ఆయన జీవితంలోని ఘట్టాలను తీసుకుని సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో పాటు ఆయన జీవితంలో ఇంకా పలు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా సినిమా తీయాలని కోరుకుంటున్నాను అన్నాడు.
ఈ సినిమాతోనే ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్న వర్మ ఇంకా ఎన్టీఆర్ జీవితంతో సినిమా చేస్తే మరెన్ని విమర్శలు, వివాదాలు మూట కట్టుకుంటాడో అని అంతా అంటున్నారు. వర్మ గతంలో పలు సినిమాలు చేస్తాను అంటూ ప్రకటించి, ఆ తర్వాత వదిలేశాడు. ఇది కూడా అంతే అని, వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తర్వాత మరో పార్ట్‌లను తెరకెక్కిస్తాడని తాను భావించడం లేదు అంటూ ఒక అభిమాని చెప్పుకొచ్చాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే వర్మ ఆ తర్వాత పార్ట్‌లను కూడా తీస్తాడేమో అని మరి కొందరు అంటున్నారు.