ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి హాట్ టాపిక్ గా నిలిచారు. మందు పార్టీ చేసుకుందాం రండి అంటూ తన అభిమానులందరికి కూడా తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. కానీ ఆయన ఆహ్వానించింది నిజమైన మందు పార్టీకి కాదు. తమ లైవ్ లో జరిగే మందు పార్టీలో హాజరై అభిమానులు కూడా తనతో పాటు వోడ్కా తాగాలని వర్మ తెలిపారు. కాగా ఇటీవల దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ చిత్రానికి వర్మ ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ, అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
కాగా తాజాగా తన బ్యూటిఫుల్ సినిమా ప్రమోషన్స్ కోసం వర్మ ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. కాగా ఈ బ్యూటిఫుల్ సినిమా న్యూ ఇయర్ పార్టీలో మీరు కూడా ఆహ్వానితులే అంటూ వర్మ తన అభిమానులకు అందరికి పిలుపునిచ్చారు. ఈమేరకు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా “మా “బ్యూటిఫుల్ ” టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, నైనా గంగూలీ తో, పార్థ సూరి తో, అగస్త్య మంజు తో కలిసి వోడ్కా తాగండి…. ఎలాగంటే Facebook, instagram ద్వారా ఈరోజు 29 రాత్రి 8.45 నుంచి లైవ్ స్ట్రీమింగ్ లో మా ప్రైవేట్ పార్టీకి పబ్లిక్ అందరూ ఆహ్వానితులే” అంటూ వర్మ ట్వీట్ పోస్టు చేశారు… ఏదేమైనా కూడా ఏదైనా సినిమా ప్రమోషన్ చేయాలంటే అది వర్మ తరువాతే ఎవ్వరైనా అని రాంగోపాల్ వర్మ మరొకసారి నిరూపించుకున్నాడు…