రామ్ చరణ్ కి అనుకుంటే రామ్ తో కుదిరింది…

Ram Replaces Ram Charan for Trinadha Rao Nakkina film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ధ్రువ సినిమా కు ముందు ప్లాప్స్ లో వున్న రామ్ చరణ్ కొత్త దర్శకులతో సినిమాలు చేయాలని అనుకున్నారు. అప్పట్లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన “సినిమా చూపిస్త మామ “ చూసి ఆ దర్శకుడు నక్కిన త్రినాధరావు మీద చరణ్ కన్ను పడింది. అప్పట్లో మంచి లైన్ ఉంటే సినిమా చేస్తానని త్రినాధరావు కు ఆఫర్ వెళ్లిందట. అలా త్రినాధ్ రావు చెప్పిన ఒక లైన్ రామ్ చరణ్ కి నచినప్పటికీ ఇంతలో ధ్రువ ముందుకు రావడంతో ఆ కథ ముందుకు వెళ్ళలేదు. అప్పుడు రామ్ చరణ్ తో అనుకున్న కథ ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేయబోతున్నారు. రామ్, నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తారు.

Ram-to-do-Movie-with-Trinad

వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రామ్, త్రినాధరావు సినిమా పట్టాలు ఎక్కించడానికి దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. ఇంతకు ముందు త్రినాధరావు తో “నేను లోకల్ “ వంటి హిట్ కొట్టిన దిల్ రాజుకు ఇప్పుడు దర్శకుడు చెప్పిన కథ ఇంకా బాగా నచ్చిందట. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేసే ఓ పాత్ర హైలైట్ అవుతుందట. హీరోయిన్ తో పాటు సినిమాకు పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు.