విరాళం ప్రకటించిన రామానాయుడి కుటుంబం

విరాళం ప్రకటించిన రామానాయుడి కుటుంబం

భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధి లేక దిగజారినటువంటి ప్రజలకు సాయం చేయడానికి చాలా మంది ప్రముఖులు ముందుకొస్తున్నారు. కాగా ఈ లిస్టులో తాజాగా దగ్గుబాటి కుటుంబం కూడా చేరింది. కాగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నటువంటి సినీ కార్మికులను ఆదుకునే ఆలోచనలో భాగంగా ఒక కోటి రూపాయలను సురేష్ బాబు, వెంకటేష్, రానాలు విరాళంగా ప్రకటించారు. ఈమేరకు వారి వేదిక ద్వారా ఒక ప్రకటనను కూడా చేశారు.

ప్రస్తుత పరిస్తితుల్లో “కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు స్థంభించిపోయాయి. వీరిలో చాలా మంది ముప్పది కోల్పోయారు. రోజు వారీ కూలీలు అయితే ఎలా పూత గడుపుతున్నారో కూడా అర్థం కానీ పరిస్థితి ఉంది. వీరందరిని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలను తీసుకుంటుంది. ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.” దానికి తోడు సినీ ప్రముఖులు అందరు కూడా తమ వంతు బాధ్యతగా తోచిన విరాళాన్ని ప్రకటిస్తున్నారు.