కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీపై ప్రముఖ యోగా గరువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు బతికిఉండటం వారిద్దరికీ ఇష్టం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమిత్ షాను చట్టవిరుద్ధంగా జైల్లో పెట్టించారని, ఆయన జైల్లోనే చనిపోవాలని వారు కోరుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అమిత్ షాను జైలుపాలు చేసిన నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరంకు కూడా అదేగతి పట్టిందని అన్నారు. తాను జైలుకు పోతానని చిదంబరం కలలో కూడా ఊహించి ఉండరని రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు. నోయిడాలో మంగళవారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.