Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణలో తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అభినందించారు. ఈ మేరకు కేసీఆర్ కు ఆయన ఓ లేఖ రాశారు. మహాసభలు విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. 12వతరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని రామోజీరావు ప్రశంసించారు.
ఇది చరిత్రాత్మకమైన నిర్ణయమని, తెలుగు భాషకు మహర్దశ పట్టించే దిశగా తీసుకున్న బలమైన నిర్ణయమని ఆయన కొనియాడారు. ఇదే విధంగా ముందుకు సాగాలని…ఉద్యోగ నియామకాల్లో కూడా తెలుగు ప్రజ్ఞను అనివార్యం చేయాలని కోరారు. తెలుగు భాషను మరింత విస్తృతం చేయాలంటే..పరిపాలనా వ్యవహారాల్లో కూడా తెలుగును తప్పనిసరి చేయాలని రామోజీరావు తన లేఖలో కేసీఆర్ కు సూచించారు